Ramarao On Duty : మరోసారి వాయిదా.. కారణం అదేనా?

మాస్ మహారాజ్ రవితేజ గతేడాది ‘క్రాక్’ సినిమాతో హిట్టు కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. అదే ఆనందంలో తన వద్దకు వచ్చిన ఆఫర్లను వచ్చినట్టు.. రెమ్యూనరేషన్ నచ్చినట్టు ఓకె చేసేసి ఫిక్స్ చేసేసాడు. అలా చేసిన సినిమాల్లో ‘ఖిలాడి’ విడుదలై ప్లాప్ అయ్యింది. మరో సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.

నిజానికైతే ఈ మూవీ మార్చి 25 నే విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ ఆ టైంకి పెద్ద సినిమాలు వచ్చి పడడంతో జూన్ 17కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అంటున్నారు. అందుకు కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాక అని చెబుతున్నారు. అయితే ఇన్సైడ్ టాక్ వేరేగా ఉంది.

శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎస్.ఎల్.వి సినిమాస్ ఎల్.ఎల్.పి’ మరియు ‘ఆర్.టి.టీమ్‌ వర్క్స్‌’ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఇతను నిర్మించిన సినిమాల్లో ఒక్క హిట్ కూడా లేదు. ‘పడి పడి లేచె మనసు’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ‘రన్’ వంటి అన్ని సినిమాలు ప్లాప్ అయినవే..! రవితేజ ‘ఖిలాడి’ ఎలాగూ ప్లాప్ అయ్యింది.. ఇక దర్శకుడికి ఇది మొదటి సినిమా.

- Advertisement -

కాబట్టి… బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగడం లేదట. హిందీ డబ్బింగ్ రైట్స్ తప్ప.. డిజిటల్ మరియు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కు చాలా ఘోరమైన రేట్లు వస్తున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ ను నిర్మాతలు వాయిదా వేసుకుంటున్నారు. తర్వాత కూడా రాకపోతే ఓన్ రిలీజ్ చేసుకోవడానికి సిద్ధపడతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు