కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే ఓ సెన్సెషన్.
సౌత్ సినిమా ప్రతిష్టను భారత చలన చిత్ర పరిశ్రమకు మొదట పరిచయం చేసింది ఆయనే. విభిన్న కథలతో సినిమాలు చేసే శంకర్ కు హిట్స్ కొదవ లేదు. “అపరిచితుడు” “రోబో” “నన్ బన్” సినిమాలతో సినీ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు. విక్రమ్ “ఐ” రజినికాంత్ “2.0” సినిమాలు సినీ ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాయి.
ఈ సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “RC15” అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. ఇటీవల వైజాగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఈ ఏడాది డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి శంకర్.. సినిమా షూటింగ్ దాదాపు మూడు నుండి నాలుగేళ్ల పాటు జరుగుతుంది. దానికి భిన్నంగా చరణ్ మూవీని చాలా స్పీడ్ గా తెరక్కిస్తున్నాడు. ఒక ఏడాదిలోనే “RC15” షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీనికి పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది. శంకర్ ఈ మూవీతో పాటు కమల హాసన్ తో “భారతీయుడు – 2” కూడా చేస్తున్నాడు.
అయితే ఈ మూవీ కొంత షూటింగ్ అయిన తర్వాత అనివార్య కారణాలతో వాయిదా పడటంతో “RC15” కి వచ్చాడు శంకర్. ఈ మూవీని త్వరగా పూర్తి చేసి మళ్లీ “భారతీయుడు – 2” సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు.
దీంతో పాటు హిందీలో రణ్ వీర్ సింగ్ తో “అపరిచితుడు” రీమేక్ కూడా శంకర్ కమిట్ అయ్యాడు. ఒకే సమయంలో మూడు సినిమాలు ఉండటంతో, తన శైలికి భిన్నంగా స్పీడ్ గా మూవీలు చేస్తున్నాడు. ఇంత స్పీడ్ తో సినిమాలు చేస్తూ, బెటర్ అవుట్ పుట్ ఇవ్వడం శంకర్ ముందున్న సవాళ్లు అని చెప్పొచ్చు.
ఈ సవాళ్లను ఎదుర్కొని, రామ్ చరణ్, కమల్, రణ్ వీర్ కు శంకర్ మంచి హిట్స్ ఇస్తాడా అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి.