Yashoda : సమంత స్పీడ్

టాలీవుడ్ అగ్ర కథ నాయక సమంత ఫుల్ స్పిడ్ లో ఉంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, పూర్తి ఫోకస్ కెరీర్ పైనే పెట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా లైన్ లో పెడుతుంది.

సమంత “శాకుంతలం” “యశోద” అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లీస్ట్ లో “శాకుంతలం” సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. దీని తర్వాత సమంత పూర్తి దృష్టి యశోద పెట్టింది. హరి, హరీష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. అలాగే, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని అతి త్వరలోనే యశోద సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. మొదటి సారిగా సమంత యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యం ఉన్న సినిమాలో నటించడంతో అంచనాలు కాస్త భారీగా ఉన్నాయి. దీనికి తోడు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ ఈ సినిమాకు పని చేయడం ప్లస్ గా మారింది. సమంత యాక్షన్ స్టంట్స్ సినిమకే హైలైట్ గా ఉంటయాట.

- Advertisement -

కాగా, ఈ సినిమా షూటింగ్ కొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా యశోద సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావడంతో విడుదల తేదీని త్వరలోనే ప్రకటిచే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు