Amma Rajasekhar: నితిన్ కి డాన్స్‌ రాదు

తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఆ తరువాత పలు మంచి పేరునే సాధించుకున్నాడు. వరుస సినిమాలు ప్లాప్ అవుతున్న తరుణంలో విక్రమ్ కె కుమార్ చేసిన ఇష్క్ సినిమా నితిన్ కెరియర్ ను మరో మలుపు తిప్పింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో నితిన్ కి కూడా మంచి మార్కెట్ ఉంది. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నితిన్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ , దర్శకుడు అమ్మ రాజశేఖర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.

ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న అమ్మ రాజశేఖర్ నితిన్ ను ఉద్దేశిస్తూ నితిన్ కి ఏమి రాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. నితిన్ కి డాన్స్‌ రాదు అని చెప్తూ, గురువులా ఉన్న తనను అవమానించారని తెలిపారు. సినిమా కార్యక్రమానికి వస్తానని చెప్పి..మాట మార్చారని మండిపడ్డారు. కనీసం బైట్ కూడా ఇవ్వలేదని, ఇంట్లో ఉండి కూడా మూవీ ఫంక్షన్‌కు రాలేదన్నాడు అమ్మరాజశేఖర్.

టక్కరి సినిమా కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ అమ్మ రాజశేఖర్‌ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు