2020 రిలీజైన భీష్మ సినిమా తరువాత నితిన్ కెరియర్ కి సరైన హిట్ సినిమా లేదు. ప్రస్తుతం నితిన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగష్టు 12 విడుదలకు సిద్ధంగా ఉంది.మాచర్ల నియోజకవర్గం చిత్రానికి ఎస్‌ఆర్ శేఖర్ దర్శకత్వం వహించారు.
పొలిటికల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు.
నితిన్ సరసన ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
రిలీజ్ రెడీ గా ఉన్న తరుణంలో సినిమా తాలూకా ప్రమోషన్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే పలు స్టిల్స్ , టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ రీసెంట్ గా మరో మాస్ సాంగ్ ను కూడా విడుదల చేసారు. వినిపిస్తున్న కొన్ని వార్తల ప్రకారం, నితిన్ తన సినిమాను ప్రమోట్ చేయడానికి కొన్ని ప్రసిద్ధ టీవీ సీరియల్‌లలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించనున్నాడట నితిన్.
ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.