Raashi Khanna: సుందరానికి ప్రశంసలు

నేచురల్ స్టార్ నాని మరియు నజ్రియా ఫహద్ నటించిన అంటే సుందరానికి జూన్ 10న విడుదలైంది. అంటే సుందరానికి విడుదలైనప్పటినుండి మంచి స్పందన లభించింది. కానీ కమర్షియల్ గా ఆడలేదు అనేది వాస్తవం. ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించకపోవడం కూడా దీనికి కారణం కావొచ్చు.

అంటే సుందరానికి సినిమా నిన్న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.ఈ చిత్రం OTT లో వచ్చినప్పటినుండి సెలబ్రిటీలతో సహా చాలా మంది ఈ చిత్రాన్ని అభినందిస్తున్నారు.

తాజాగా రాశీ ఖన్నా అంటే సుందరానికి సినిమాపై ప్రశంసలు కురిపించింది. రాశీ ఇన్‌స్టాగ్రామ్‌లో, “అంటే సుందరానికి ఒక జెమ్. నాని మరియు నజ్రియా ఫహద్ మరియు మొత్తం తారాగణం అద్భుతంగా ఉంది. వివేక్ ఆత్రేయ, ఇలాంటి కథలు వ్రాసి సినిమా చేసినందుకు ధన్యవాదాలు. అంటూ రాసుకొచ్చింది.

- Advertisement -

ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రోహిణి, నరేష్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు