Krithi Shetty : కోలీవుడ్ ఛాన్స్ మిస్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ ఎక్కువగా వస్తున్నారు. ఎంత మంది వచ్చినా, సీనియర్ల పోటీ వల్ల నిలదొక్కవడం కష్టంగా ఉంది. కానీ, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి మాత్రం వెనక్కితగ్గడం లేదు. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ, సీనియర్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుంది. తొలి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ్మకు రోజు రోజుకు పెరుగుతుంది. ఉప్పెన తర్వాత వచ్చిన సినిమాలు కూడా హిట్ కొట్టడంతో బేబమ్మకు మంచి మార్కులు పడ్డాయి.

దీంతో ప్రస్తుతం మిడ్ రేంజ్ లకు, కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది కృతిశెట్టి. ఈ బ్యూటీ ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ది వారియర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో యంగ్ హీరో నితిన్ మాచర్ల నియోజక వర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తుంది. వీటితో పాటు మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఈ బేబమ్మ ఓ స్టార్ హీరోను రిజక్ట్ చేసిందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైనప్ చేశాడు విశాల్. ఈ సినిమా కోసం యంగ్ బ్యూటీ కృతిశెట్టిని సంప్రదించారట. కానీ, బిజీ షెడ్యూల్, డేట్లు ఖాళీ లేక పోవడంతో కృతిశెట్టి రిజక్ట్ చేసిందని టాక్.

- Advertisement -

ఒక వేళ విశాల్ సినిమాలో కృతిశెట్టి నటిస్తే, కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేది. విశాల్ కు ఉన్న ఇమేజ్ తో సినిమా హిట్ అయితే, తమిళ ప్రేక్షకులకు దగ్గర అయ్యేది. కానీ, విశాల్ సినిమాను రిజక్ట్ చేయడంతో కృతిశెట్టి కోలీవుడ్ కు వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు