రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్లు గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. జూన్ 17న విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ ను మెప్పించింది. పాజిటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. మొదటి వారానికే చాలా ఏరియాల్లో ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ వీకెండ్ వరకు అన్నట్టు నిలబెట్టారు. అయితే ‘విరాట పర్వం’ బయ్యర్స్ కు ఓవరాల్ గా 9 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. సినిమా మొత్తంగా ఇప్పటి వరకు 5 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయిందని సమాచారం.
అయితే, ఈ సినిమాకు వచ్చిన నష్టాలను ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ భరించాల్సి ఉంటుందని ఓ అగ్రిమెంట్ ఉందని టాక్. విరాట పర్వం సినిమాను నిర్మించిన వారే, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ని నిర్మించారు. అయితే, ఈ చిత్రం రిలీజ్ కావాలి ఉంది. కానీ, ఆ చిత్రాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాలేదని కారణంగా వాయిదా వేసి, తమ కోసం కేటాయించిన రిలీజ్ డేట్ ను వదులుకోవడం ఇష్టం లేక ‘విరాటపర్వం’ ని థియేటర్లలో దించారట నిర్మాతలు. కానీ ఈ చిత్రం బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగిల్చింది. దీంతో అగ్రిమెంట్ ప్రకారం, ‘రామారావు ఆన్ డ్యూటీ’ ని నిర్మాతలు తక్కువ రేట్లకే బయ్యర్లకు ఇవ్వాల్సి ఉంటుందని భోగట్టా. అయితే, ఈ నష్టాలను రవితేజ రామరావ్ ఆన్ డ్యూటీ తీరుస్తాడా? లేదా విరాట పర్వం లాగే, బాక్సాఫీస్ ముందు నిర్మాతలకు నిరాశనే దక్కుతుందా అని తెలియాలంటే, ఈ సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.