Mega154 : ‘ఆదిపురుష్’ నిలబడగలదా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాలీవుడ్లో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. హిందీ, తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2023 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ‘ఆదిపురుష్’ తో పాటు విజయ్ ‘వారసుడు’, వైష్ణవ్ తేజ్ .. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో చేస్తున్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే ఉండబోతున్నాయి. అయితే విజయ్, వైష్ణవ్ ల సినిమాలతో ప్రభాస్ సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ, నిన్న అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 154’ కూడా సంక్రాంతి రేసులో ఉండబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మెగాస్టార్ సినిమాతో ప్రభాస్ ‘ఆదిపురుష్’ కు పెద్ద ఇబ్బంది వచ్చినట్టే అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ‘ఆదిపురుష్’ అనేది మైథలాజికల్ మూవీ. ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉండదు. బాగుంది అంటే ఒకసారి చూస్తారు అంతే. అయితే చిరు- బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ పక్కా మాస్ మూవీ. సంక్రాంతి సీజన్ కు ఇలాంటి సినిమాలకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలకే వస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో మెగాస్టార్ కు పోటీగా డార్లింగ్ సిలబడగలడా అని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు