Star kid: విడాకులు తీసుకోబోతున్న స్టార్ కిడ్.. అక్రమ సంబంధం ఏ కారణం అంటూ భార్య ఎమోషనల్ పోస్ట్..!

Star kid:  సినీ ఇండస్ట్రీలో చాలామంది విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. రోజురోజుకీ విడాకులు తీసుకోబోతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వీరు విడాకులు కి సిద్ధపడుతున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా తన భార్యతో విడిపోయి సింగల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ వారసుడు అండ్ నటుడు యువరాజ్ కుమార్ తన భార్య కి విడాకులు ఇవ్వబోతున్నాడు. అయితే రాజ్ కపూర్ కు ముగ్గురు కొడుకులు. శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. రాఘవేంద్ర కుమారుడే ఈ యువ రాజ్ కుమార్. అయితే యువ మైసూర్ కు చెందిన శ్రీదేవి నీ ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం అయ్యి నాలుగేళ్లు పూర్తి కానోస్తుండగా.. ఈలోపే మనస్పర్ధాలు రావడంతో విడాకులకు దారితీసారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Byrappa (@sridevibyrappa)

ఇక ఈ విషయంపై యువరాజ్ భార్య శ్రీదేవి ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ..” వృత్తిపరమైన అలంకారాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి అందులో నిజం లేకుండా బహిరంగంగా ఒక మహిళ అవమానించేలా మాట్లాడడం దురదృష్టకరం. చాలా బాధాకరమైనది ఈ ఘటన. గత కొన్ని నెలలుగా నేను అనుభవించిన అన్ని బాధలను బయటకు చెప్పకుండా కుతుందా గౌరవాన్ని కాపాడేందుకు నేను పూర్తిగా మౌనంగా ఉన్నాను. కానీ నా గౌరవాన్ని అండ్ మనస్తత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పు. యువరాజుకు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తాయని నేను భావిస్తున్నా ” అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది శ్రీదేవి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు