Tollywood: రాజ్ తరుణ్‌ అంటే వణికిపోతున్న హీరోయిన్‌ ?

Chandini Chowdary: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చాందిని చౌదరి ఈ హీరోయిన్ కి పెద్దగా పరిచయం అవసరం లేదు. కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటిగా మంచి ప్రశంసలు తెచ్చుకుంటుంది. పేరుకు తెలుగమ్మాయి.

కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు అందుకున్న చాందిని చౌదరికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం దొరకడం లేదు. ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ గుర్తింపు మాత్రం పెద్దగా రావడం లేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ…. హీరో రాజ్ తరుణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

Chandini Chowdary: Two movies on the same day.. Are they set?

- Advertisement -

రాజ్ తరుణ్ తో కలిసి నటించకపోవడంపై గల కారణాలను చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తో నటించకపోవడానికి గల ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. రాజ్ తరుణ్ తో కలిసి నటించడానికి ఇంతవరకు సమయం రాలేదు. కొన్ని సినిమాల్లో ఆ హీరోతో జోడిగా ఛాన్సులు వచ్చాయి. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాల్లో నేను నటించలేదు.

రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాల్లో హీరోయిన్గా నన్నే సంప్రదించారు. కానీ అనుకోకుండా ఆ మూడు సినిమాలు చేయడం నాకు కుదరలేదు. అంతకుమించి ఎలాంటి కారణం లేదు. ఇప్పటికీ మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఎప్పటికీ టచ్ లోనే ఉంటాం. అంతేకానీ వేరే కారణమంటూ ఏమీ లేదు అని చాందిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాందిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు