Thalapathy Vijay: విజయ్ గొప్ప మనసు..వారికి భారీ బహుమతులు

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్‌ కళ్యాణ్‌ కు ఎంత క్రేజ్‌ తెలుగులో ఉందో…తమిళ్‌ ఇండస్ట్రీలో విజయ్‌ కు అంతే క్రేజ్‌ ఉంటుంది. విజయ్ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతను చేసే సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

దళపతి 69 తర్వాత ఆయన సినిమాలు తీసే అవకాశం లేదంటూ ఇండస్ట్రీవర్గాల్లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. దీనికి గల కారణం గురించి ఆరా తీయగా…..ఆయన తాజాగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే విజయ్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలనేది అతని ముఖ్య ఉద్దేశం.

ipl-2024-thalapathy-vijay-bought-two-ipl-tickets-for-varalaxmi-sarathkumar
Thalapathy Vijay

ఇటీవల విడుదలైన టెన్త్ ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి విజయ్ బహుమతులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ “తమిళగ వెట్రి కలగం” ప్రతినిధులు ప్రకటించారు. ఈ సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్స్ తో పాటుగా రివార్డులను అందజేయనున్నారట. జూన్ 28, జూలై 3 తేదీల్లో చెన్నై వేదికగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారిగా టెన్త్ ఇంటర్ లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు