Kalki 2898AD: అప్పుడే విమర్శలు మొదలు.. ఆమె వల్లేనా..?

Kalki 2898 AD: ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా బాగా లేదంటే అప్పుడే ట్రోల్స్ చేయడం, విమర్శించడం మొదలు పెట్టేస్తారు నెటిజన్లు. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే నచ్చకపోతే ఇట్టే తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కల్కి 2898.. అయితే ఈ సినిమా ట్రైలర్ అలా విడుదలైందో లేదో అప్పుడే ఈ సినిమాలోని పాత్రలపై విమర్శలు మొదలయ్యాయి.. ముఖ్యంగా బాలీవుడ్ , హాలీవుడ్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న దీపికా పదుకొనే పై విమర్శలు వెల్లువెత్తడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. మరి అసలు విషయం ఏమిటో చూద్దాం.

దీపిక డబ్బింగ్ పై విమర్శలు..

Kalki 2898AD: Then the criticism started.. is it because of her..?
Kalki 2898AD: Then the criticism started.. is it because of her..?

తాజాగా కల్కి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ కల్కి ట్రైలర్ ని అంతా అభినందిస్తున్నారు.. కానీ కల్కి ట్రైలర్ లో అందరూ ఒక విషయంపై మాత్రం విమర్శిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా కల్కి ట్రైలర్లో డబ్బింగ్ అంతా పర్ఫెక్ట్ గా లేదు అనిపిస్తోంది.. అందరికంటే కూడా దీపికా పదుకొనే డబ్బింగ్ అస్సలు బాగోలేదు అనే విమర్శలు వైరల్ అవుతున్నాయి.. అది దీపికనే చెప్పిందా లేక వేరే ఎవరైనా ఆమెకు డబ్బింగ్ చెప్పారా..? ఆ తెలుగు ఏమిటి? ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్నారు..? చివర్లో హడావిడిగా దీపికాతో డబ్బింగ్ చెప్పించారా.. ఏంటి ? లేక సినిమాలో క్యారెక్టర్ అలాగే మాట్లాడుతుందా ? అని ప్రశ్నిస్తూ కల్కి టైలర్ లోనే దీపికా పదుకొనే క్యారెక్టర్ డబ్బింగ్ పై సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రోల్స్ చేస్తున్నారు..

గర్భవతిగా నటన..

దీంతో దీపికా పదుకొనే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే దీపికా గర్భవతిగా నటించింది.. నటన. పరంగా దీపికకు ఎటువంటి వంకలు పెట్టలేకపోయినా తెలుగు డబ్బింగ్ పై మాత్రం కామెంట్లు చేస్తూ ఉన్నారు.. మరి సినిమాలో కూడా ఇలాగే ఉంటుందా అనే ఆశ్చర్య అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.. అంతేకాదు ట్రైలర్లో డబ్బింగ్ వాయిస్ చూసి ఇది మొత్తం ఏఐ వాయిస్ లాగా ఉంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికి వారు తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు.. ఏది ఏమైనా దీపికా పదుకొనే ఈ మధ్యకాలంలో భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.

- Advertisement -

పఠాన్ విషయంలో కూడా ట్రోల్స్..

ఇటీవలే పఠాన్ సినిమా విషయంలో కూడా ఈ రేంజ్ లోనే ఈమె ట్రోల్స్ ఎదుర్కొంది.. ఇందులో బికినీ ధరించింది.. పైగా కాషాయపు రంగు బికినీ ధరించడంతో హిందూ మతాన్ని ఈమె అగౌరవపరిచింది అంటూ విశ్వ మానవ వేదిక పూర్తిస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆ సినిమాలో ఈమె పై కూడా పూర్తి విమర్శలు వచ్చాయి.. కానీ సినిమా మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. మొత్తానికైతే ఇప్పుడు కల్కి సినిమా విషయంలో కూడా ఈమెకు విమర్శలు ఎదురవుతున్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది.. ? దీపికాకు ఎలాంటి గుర్తింపు వస్తుంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు