Nayanthara: అందరి ముందు నయన్ ని డ్రెస్ చేంజ్ చేసుకోమన్న డైరెక్టర్.. మరి ఇంత ఘోరమా..?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మీ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె అనంతరం అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గజిని మూవీ టైం లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది నయనతార. ఆమె మాట్లాడుతూ..” మురగదాస్ చెన్నై వైఎంసీఏ‌ గ్రాండ్ లో గజిని సినిమాలో నన్ను విలన్లు వెంబడించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సీన్లో నేను పరిగెత్తుతున్నప్పుడు మురుగదాస్ కట్ చెప్పారు. ఆ సమయంలో నేను ధరించిన చొక్కా వల్ల ఆ సీన్ లో కాస్త అసభ్యత ఎక్కువగా కనిపించిందని మురుగదాస్ ఇది చాలా అసభ్యకరంగా ఉంది.

The director wants to change Nayan's dress in front of everyone
The director wants to change Nayan’s dress in front of everyone

కాబట్టి నేను ఈ చొక్కా తో ఉండగా షార్ట్ తీయలేను. మరో చొక్కా వేసుకో అని అడిగాడు. అయితే నా దగ్గర వేరే చొక్కా లేదు అని చెప్పాను. చివరి క్షణంలో ఇలా ఎందుకు చెబుతున్నారు.. నేను వేరే బట్టలు కూడా తీసుకురాలేదు. కనీసం మార్చుకోవడానికి క్యారవాన్ కూడా లేదని చెప్పాను. ఆ వెంటనే మురుగదాస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి ప్లాట్ఫార్మ్ పై ఓ షట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత వేసుకోవడానికి సరైన ప్లేస్ లేకపోవడంతో అక్కడ పార్క్ చేసిన కారు వెనక్కి వెళ్లి వేసుకోమని చెప్పాడు ” అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ప్రజెంట్ నయనతార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు