Hero Suhas: అభిమాన నటుడిని ఇంటర్వ్యూ చేసిన సుహాస్.. ఆనందంలో మునిగి తేలుతున్నాడు గా..!

Hero Suhas: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటించిన మూవీ మహారాజా. ఈ సినిమా అన్ని పనులు ముగించుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ని తమిళం తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రం వస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇక తాజాగా ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా .. సుహాస్ విజయ్ సేతుపతిని ఇంటర్వ్యూ చేశారు.

Suhas who interviewed his favorite actor
Suhas who interviewed his favorite actor

ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకు సినిమాల్లో ఇన్స్పిరేషన్ విజయ్ సేతుపతి అని చెప్పే సుహాస్.. తన అభిమాన నటుడిని ఇంటర్వ్యూ చేయడంతో తన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నావ్. ఇక పూర్తి ఇంటర్వ్యూ ను చూసేందుకు ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో నెట్టింట హల్చల్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు