ఓ మై ఫ్రెండ్, ఎంసీఎ లాంటి యావరేజ్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ కు ఏకంగా పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని వేణు శ్రీ రామ్ వంద శాతం ఉపయోగించుకున్నాడు. బాలీవుడ్ పింక్ ను తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేసి టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోవడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. వేణు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడని పవన్ అభిమానులు కూడా ఊహించలేదు. వకీల్ సాబ్ సక్సెస్ తో పవన్ కళ్యాణ్ కూడా వేణు తో ఇంకో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు కూడా కథనాలు వినిపించాయి. పవన్ కంటే ముందే అల్లు అర్జున్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ అలాంటిది ఏమీ జరగలేదు. సాయి ధరమ్ తేజ్, నాని వంటి హీరోలతో వేణు సినిమాలు ఉంటాయి అని కూడా వార్తలు వచ్చాయి. కానీ, వేణు కంటే ముందే వాళ్ళు వేరే డైరెక్టర్ లతో సినిమాలు కమిట్ అవ్వడంతో, వాళ్ళు ప్రస్తుతం ఖాళీగా లేరు. పవర్ స్టార్ లాంటి హీరోకు హిట్ ఇచ్చి కూడా వేణు ఏడాది పైనే ఖాళీగా ఉంటున్నాడు.