మహానటి చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చక్కగా పోషించింది. సావిత్రియే ఈ సినిమాలో నటిస్తున్నారా, అంటూ ఆశ్చర్యపోయేలా సావిత్రి పాత్రను కీర్తి ఓన్ చేసుకుంది. ఈ ఒక్క చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. పారితోషికం కూడా మూడు రెట్లు పెరిగింది. మహానటికి ముందు కీర్తి పలు చిత్రాల్లో నటించినా, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నా, కీర్తికి లైఫ్ ఇచ్చిన సినిమా అంటే మహానటి అనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ సాఫీగానే సాగింది. కానీ సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, కీర్తి సురేష్ కు గట్టి పోటీ ఇస్తుంది. సాయి పల్లవి ఇంకా స్టార్ హీరోల సినిమాల్లో నటించకుండానే లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలో కీర్తి సురేష్, సాయి పల్లవి ల అభిమానుల మధ్య మా హీరోయిన్ గొప్ప అంటే మా హీరోయిన్ గొప్ప అనే వాదన కూడా మొదలైంది.
ఈ క్రమంలో సింగర్ రఘు కుంచె కామెంట్స్ ఈ వాదనలకు మరింత తావిచ్చినట్టు అయ్యింది. విషయం ఏంటంటే విరాట పర్వం చిత్రం చూసిన రఘు కుంచే, సాయి పల్లవి గురించి ‘ఈ తరానికి ఆమె ఒక మహానటి సావిత్రి. సినిమా సినిమాకి సాయి పల్లవిపై పెరుగుతుంది ‘ అంటూ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. సాయి పల్లవి నటన చూస్తే ఇది నిజమే అని కొంత మంది అంటున్నారు. అలాగే మరి కొందరు సావిత్రి సాయి పల్లవి అయితే మరి కీర్తి సురేష్ ఏంటి అనే కామెంట్లు పెడుతున్నారు.