SS Rajamouli : జక్కన్న దర్శకత్వంలో హారర్ సినిమా ?

రాజమౌళి దర్శకత్వంలో హారర్ సినిమా. వినడానికి ఓ పక్క విడ్డూరంగా మరోపక్క ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. అలా అని రాజమౌళి, హారర్ సినిమా చేయడం లేదు. ఆ సినిమాల గురించి తన అభిప్రాయం తెలియజేశాడు అంతే ! శనివారం జరిగిన అన్య టుటోరియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి అతిథిగా వెళ్ళాడు. ఈ సందర్భంగా జక్కన్న హారర్ సినిమాల గురించి మాట్లాడుతూ, “ఇలాంటి సినిమాలకు నేను చాలా దూరం. అసలు ఇలాంటి సినిమాలు కూడా చూడను. నా జీవితంలో నేను చూసిన హారర్ సినిమాలు చాలా తక్కువ. నేను ఆ సినిమాలు చూస్తున్నప్పుడు నా భార్య రమను పక్కన పెట్టుకుని చూస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. అంటే మీ దర్శకత్వంలో హారర్ సినిమాను చూడలేమా అని అనే ప్రశ్న ఎదురైంది.

దీనిపై ఆయన స్పందిస్తూ.. నవరసాలలో భయానకం అనేది కూడా ఒకటి. హారర్ సినిమాలు ప్రధానంగా భయపెట్టడం, థ్రిల్లింగ్ కు గురిచేయడం వంటి వాటి పై రూపొందుతాయి. కానీ అందులో కూడా ఓ ఎమోషన్ ఉండాలి. రైటింగ్ ద్వారా ఆ ఎమోషన్ పుట్టాలి. అలాంటి స్క్రిప్ట్ రెడీ అయితే చెప్పలేము. కానీ, చేయొచ్చు అంటూ దర్శకధీరుడు చెప్పుకొచ్చాడు. మరి రాజమౌళి కోరుకున్న స్క్రిప్ట్ ను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేస్తాడా, జక్కన్న దర్శకత్వంలో హారర్ సినిమా వస్తుందా, అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు