Major : ఫ్లాప్ టాక్ తో “మేజర్” హిట్ !

మేజర్ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వగా, అక్కడ మంచి టాక్ సంపాదించుకున్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. దీంతో ఆ ఏరియాల్లో ఈ చిత్రం నష్టాలు మిగల్చడం ఖాయం అనుకున్నారు. హిందీలో భూల్ బులాయా 2, మలయాళం లో విక్రమ్ వంటి సినిమాల పోటీ వల్ల మేజర్ వెనుక పడింది. ఆ రెండు ఏరియాల్లో మేజర్ ను రూ.5 కోట్లకు విక్రయించారు. అయితే స్లోగా ఈ మూవీ అక్కడ పికప్ అయ్యింది.

రెండు వారాల్లో ఈ మూవీ అక్కడ రూ.5.4 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసి పెట్టిన పెట్టుబడి రాబట్టి, కొంతమేర ప్రాఫిట్స్ ను అందించింది. అయితే ఈ మూవీ ‘ ది కశ్మీర్ ఫైల్స్ ‘ స్థాయిలో కలెక్ట్ చేస్తుంది అని అంతా భావించారు. కానీ ప్రమోషన్లను మాత్రం ఆ స్థాయిలో నిర్వహించలేదు. అందుకే ఆ స్థాయిలో అయితే పెర్ఫార్మ్ చేయలేదు. కానీ, ప్రేక్షకులను కొంత వరకు మెప్పించి, బయ్యర్లు కు లాభాలను తెచ్చిపెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు