Siddhu Jonnalagadda : ఈ సారి విలన్ ?

ఇండస్ట్రీలో హిట్ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన వాళ్లలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. “గుంటూర్ టాకీస్” తో ప్రేక్షకులను కొంత వరకు మెప్పించినా, హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. కానీ, ఇటీవల వచ్చిన “డీజే టిల్లు” సినిమాతో సిద్ధు తొలిసారి ఇండస్ట్రీ హిట్ రుచి చూశాడు. ఫ్యాన్ బేస్ ను కూడా పెంచుకున్నాడు. సిద్ధు సినిమాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారంటే, దానికి కారణం “డీజే టిల్లు” అని చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే “డీజే టిల్లు” సినిమా విడుదలకు ముందే, దీనికి సీక్వెల్ ఉంటుదని మేకర్స్ నుండి ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ దాదాపు ఖాయం అయిపోయింది.

కాగా, ఫిల్మ్ నగరంలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సిద్ధు జొన్నలగడ్డ మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా కాకుండా, విలన్ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడట. సిద్ధు ఇప్పటికే రాజశేఖర్ “కల్కి” సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త సినిమాలో సిద్ధు ఫుల్ లెన్త్ విలన్ రోల్ లోనే ఉంటాడని టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు