Tees Maar Khan Teaser : పవర్ ఫుల్ పోలీస్ గా ఆది

విలక్షణ నటుడు సాయి కుమార్ కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆది, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. టాలీవుడ్ లో అత్యధికంగా సినిమాలను సెట్ చేస్తుకున్న హీరో ఆదియే కావచ్చు. ఆది చేతిలో దాదాపు 8 సినిమాలు ఉన్నాయి. కొన్ని కరోనా మహమ్మారి కంటే ముందే స్టార్ట్ కాగా, అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో మరికొన్ని సినిమాలకు సైన్ చేయడంతో లీస్ట్ పెరిగింది. ఈ లీస్ట్ లో “తీస్ మార్ ఖాన్” ఒక్కటి.

కళ్యాణ్ జి గొనగ దర్శకత్వంలో, విజ‌న్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2021 మొదట్లో స్టార్ట్ కాగా, డిసెంబర్ నెలలోనే షూటింగ్ పూర్తి అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేయడానికి మూవీ యూనిట్ రెడీ అయిపోయింది. తాజా గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ టీజర్ తో ఈ సినిమాలో ఆది రౌడీ పోలీస్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ గ్లామర్ షో హైలైట్ గా నిలుస్తుంది. ఆది-పాయల్ మధ్య కెమిస్ట్రీని డైరెక్టర్ కళ్యాణ్ బాగానే డిజైన్ చేశాడు. ఇప్పటి వరకు చిన్నపాటి విలన్ పాత్రల్లో నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ ప్రతి నాయుకుడిగా కనిపించాడు. సీనియర్ హీరోయిన్ పూర్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

మొత్తంగా కొంత వరకు ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ టీజర్ తో సినిమాపై కాస్త అంచనాలు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఆదికి గత అనుభవాన్నే ఇస్తుందా, లేదా మంచి హిట్ ఇస్తుందా అంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు