Megastar : మరో మెగా లీక్ !

సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ, వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజతో గాడ్ ఫాదర్, బాబి డైరెక్షన్ లో మెగా 154 చేస్తున్నాడు. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా వస్తుందని ఓ పుకారు కూడా ఉంది.

నాలుగు సినిమాలు చేతిలో పెట్టుకున్న చిరంజీవి, వీటికి సంబంధించిన అంశాలను సిక్రెట్ గా ఉంచడంలో మాత్రం విఫలమవుతున్నారు. స్వయంగా చిరుయే పలు వేదికలపై, తను నటిస్తున్న సినిమాల గురించి లీక్ ఇస్తూనే ఉంటారు. గతంలో ఓ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన చిరు, మాటల్లో పడి తన తర్వాత సినిమా ఆచార్య అంటూ మెగా లీక్ ఇచ్చి, నాలుక కరుచుకున్నాడు.

ఈ మధ్య కాలంలోనే బాబి దర్శకత్వంలో వస్తున్న మెగా 154 సినిమాలో తన పాత్ర పేరు వాల్తేరు వీరయ్య అని పోరపాటున లీక్ చేశారు. ఇలా రెండు సార్లు తన సినిమాలపై లీక్స్ ఇచ్చిన చిరంజీవి, మరోసారి మెగా లీక్ ఇచ్చాడు.

- Advertisement -

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో ఓ ప్రత్యేక షో వస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఫైనల్ శుక్రవారం ప్రసారమైంది. ఈ షోలో అందరూ అనుకున్నట్టే వాగ్ధేవి విజేతగా నిలిచి కప్పు గెలుచుకుంది. అంతే కాకుండా, మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో ఓ పాట పాడే అవకాశాన్ని కొట్టేసింది. అయితే, ఇక్కడ ఓ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేత స్వయంగా మెగాస్టార్ చిరంజీవియే లీక్ చేయించాడు.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి-నయనతార అన్న చెల్లెలుగా నటిస్తున్నారని, అందులో భాగంగా వీరి మధ్య ఓ సెంటిమెంట్ సీన్ సమయంలో ఓ సాంగ్ వస్తుందని, ఆ పాటను వాగ్ధేవి పాడుతుందని థమన్ చెప్పేశాడు. ఇంకా ఇది షూట్ కాలేదని వివరించాడు. నిజానికి, గత కొద్ది రోజుల నుండి గాడ్ ఫాదర్ సినిమాలో చిరు-నయన్ అన్న చెల్లెల పాత్రలో నటిస్తున్నారని ఓ రూమర్ ఉంది.

తాజాగా, చిరు, థమన్ ఇచ్చిన లీక్ తో ఇది రూమర్ కాదు, నిజమే అని క్లారిటీ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు