Adipurush : ఆదిపురుష్ వ్యూహామేంటి..?

ఒక సినిమాలో కథలో అద్భుతమైన కంటెంట్ ఉన్నా, స్టార్ కాస్టింగ్ ఉన్నా, భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించనా, దాన్ని ప్రేక్షకుల వరకు చేర్చకుంటే, చేదు ఫలితాలే వస్తాయి. అందుకే నిర్మాతలు ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. చిన్న సినిమాలు కూడా ప్రమోషన్స్ కు ఇచ్చే ప్రాధాన్యత వేరే లెవెల్లో ఉంటుంది. ఇక భారీ బడ్జెట్ సినిమాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. రిలీజ్ కు దాదాపు ఆరు నెలల ముందు నుండే, ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ టీం రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్స్ హాడావుడి ఇంత అంత కాదు. కోట్ల రూపాయలను కుమ్మరించి సినిమాపై దేశం నలుమూలల హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. దీని వల్లే ఈ మూవీ 1,150 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎక్కువే. అందులో ఆదిపురుష్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

- Advertisement -

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 11న రిలీజ్ కానుంది. రిలీజ్ కు మరో ఏడు నెలల టైం మాత్రమే ఉన్నా, ఇప్పటి వరకు ఆదిపురుష్ టీం ప్రమోషన్స్ ఊసే ఎత్తడం లేదు. 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీని దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం కావాలి. అలాంటి ప్రచారం ఆదిపురుష్ కు జరగక పోతే, దారుణమైన ఫలితాలను చవి చూడాల్సి వస్తోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రమోషన్స్ విషయంలో మూవీ టీంపై పెదవి విరుస్తున్నారు. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చూసైనా, ఆదిపురుష్ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాందో, లేదా మరి కొద్ది రోజులు ఇలాగే కాలం వెల్లదీస్తుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు