Pakka Commercial : గోపీచంద్ “అందాల రాశీ..” సాంగ్ ప్రోమో అవుట్

ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ తోనే అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుండి అనూహ్య‌మైన స్పంద‌న వస్తుంది. అలాగే ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దీంతో పాటు దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుదలై, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీ ఖన్నా, మధ్య కెమీస్ట్రీ ఆకట్టుకుంటుంది. మూవీలో ఇద్దరూ లాయర్లు కావడంతో ఈ పాటను కూడా కోర్టును తలపించే సెట్స్ లోనే చిత్రీకరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు