Ram charan: కథలో మార్పులు కోరిన చరణ్

నటనలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రామ్ చరణ్,వ్యక్తిత్వంలో కూడా తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు.
చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిరు తనయుడి కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయ్,కానీ చెప్పుకోదగ్గ లవ్ స్టోరీ ఒకటి కూడా లేదు.
ఎంతో నమ్మకంతో తీసిన ఆరెంజ్ ఎటువంటి ఫలితాన్ని ఇచ్చిందో మనకు తెలిసిందే,అందుకే మరో అద్భుతమైన లవ్ స్టోరీ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడట ఈ మెగా పవర్ స్టార్ దీనికోసం “జెర్సీ” సినిమా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ను లైన్ లో పెట్టిన విషయం మనకు తెలిసిందే.

“మళ్ళీ రావా” సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే మంచి ప్రసంసలు అందుకున్నాడు, ఫామ్
లో లేని సుమంత్ ను హీరోగా పెట్టి హిట్ కొట్టాడు అంటే అది మాములు విషయం కాదు.ఆ తరువాత నేచురల్ స్టార్ నానితో చేసిన “జెర్సీ” సినిమా గౌతమ్ ను దర్శకుడిగా ఇంకో స్థాయికి తీసుకెళ్లింది.బాలీవుడ్ లో కూడా “జెర్సీ” పూర్తిచేసిసిన గౌతమ్ ప్రస్తుతం చరణ్ స్క్రిప్ట్ పనుల్లో పడ్డాడట.

RRR విజయంతో సూపర్ హైలో ఉన్న చరణ్ కెరియర్ కి ఆచార్య సినిమా కొద్దిపాటి బ్రేక్ వేసింది. అందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు చరణ్. తాజాగా గౌతమ్ తిన్ననూరి కథను విన్న చరణ్ స్క్రిప్ట్‌లో మరిన్ని మార్పులు చేయమని కోరినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు