Pan India Movies : టార్గెట్ 1,000 కోట్లు..!

దేశంలో ఏ ఇండస్ట్రీలో అయినా, ఓ సినిమా 100 కోట్ల కలెక్షన్లు రావాలంటే పెద్ద సమస్యగా ఉండేది. 100 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అనేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సినిమాల బడ్జెట్ యే 100 కోట్లకు పైగా ఉంటున్నాయి. ఇక వసూళ్ల విషయంలో అందరి టార్గెట్ 1,000 కోట్లే. తెలుగులో బాహుబలి, బాలీవుడ్ లో దంగల్ సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతల అందరికీ ఇలాంటి లక్ష్యాలే ముందుంటున్నాయి.

కాగా, ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పదుల సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే వీటిలో 1,000 కోట్లు కలెక్షన్లు రాబట్టే సత్తా కొన్ని సినిమాలకు మాత్రమే ఉంది. అవేంటో ఇప్పుడు చూద్ధాం.

బ్రహ్మాస్త్ర :
బాలీవుడ్ హాట్ కపుల్ రణ్ బీర్ కపూర్ – అలియా భట్ జంటగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. 300 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీని అయాన్ ముఖర్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ, 1,000 కోట్లు వసూళ్లు చేయడం ఖాయమని బీ టౌన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

లాల్ సింగ్ చద్దా :
బాలీవుడ్ కు దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి హిట్ సినిమాలు ఇచ్చిన అమీర్ ఖనా్ లేటెస్ట్ గా లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో మరోసారి 1,000 కోట్ల కలెక్షన్లు వచ్చే సత్త అమీర్ ఖాన్ కే ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

ఆదిపురుష్ :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ ఆదిపురుష్. రామాయాణ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ 500 కోట్లతో తెరకెక్కుతుంది. ఈ మూవీ 1,000 కోట్ల కు మించి కలెక్షన్లు తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు.

సలార్ :
కేజీఎఫ్ -2 తో ప్రశాంత్ నీల్, బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. వీరి కాంబోలో మూవీ వస్తుండటంతో మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 1,000 కోట్ల కలెక్షన్లు రావడం పెద్ద విషయమేమీ కాదని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

ప్రాజెక్ట్ కె :
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కె పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో పాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ “పఠాన్”, సల్మాన్ ఖాన్ “టైగర్ – 3”, అల్లు అర్జున్ “పుష్ప ది రూల్” సినిమాలు కూడా 1,000 కోట్ల మార్కును అందుకునే అవకాశాలున్నాయి.

ఇప్పటి వరకు దేశంలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే 1,000 కోట్లు రాబట్టాయి. ఈ సినిమాలతో ఈ సంఖ్య మరింత పెరిగనుందని మూవీ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు