NBK107 : నందమూరి ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్

నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ అంత ఇంత కాదు. దీనికి తోడు ఆయనకు సరిపోయే మాస్ ఎలివేషన్స్ తో సినిమా వస్తే, నందమూరి ఫ్యాన్స్ కు పండుగే. ఇటీవలే బోయపాటి శ్రీన్ దర్శకత్వంలో బాలయ్య అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఆ మాస్ ఎలివేషన్స్ అని చెప్పొచ్చు. తాజా గా బాలయ్య అదే తరహాలో మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

బాలయ్య హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ, అఖండను మించిన యాక్షన్ సీన్స్ తో డైరెక్టర్ గోపీచంద్ డిజైన్ చేస్తున్నాడు.

ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన మాస్ లుక్ ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచింది. తాజా గా ఎన్టీఆర్ శత జయంతి కానుకగా అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో బాలయ్య లుక్ ను చూపిస్తూ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫుల్ వైట్ అండ్ వైట్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశంలో కత్తి పట్టుకుని కోపం ఊగిపోతున్న బాలయ్య ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు.

- Advertisement -

ఈ పోస్టర్ తో నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కు కూడా ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పోస్టర్ తో ఓ లెజెండ్, ఓ అఖండ కలిపితే NBK 107 అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు