Anil Ravipudi : ‘ఎఫ్3’ డైరెక్టర్ కు పారితోషికం ఎంతో తెలుసా..?

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘ఎఫ్3’. ఈరోజు విడుదలైన ఆ మూవీకి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పుడు ‘ఎఫ్3’ చిత్రాలతో అతను డబుల్ హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీగా కనిపిస్తుంది. దీంతో రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచాడు. అంతేకాదు ఈ మూవీకి అనిల్ రావిపూడి పారితోషికం తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

నిజానికి ‘ఎఫ్3’ చిత్రానికి హీరోలకంటే దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషికమే ఎక్కువట. ఈ చిత్రం కోసం వెంకటేష్ రూ.15 కోట్లు పారితోషికం అందుకోగా వరుణ్ తేజ్‌ రూ.7 కోట్లు పారితోషికం అందుకున్నాడట.కానీ అనిల్ రావిపూడి ఏకంగా రూ.15 కోట్లు పారితోషికానికి పైగా తీసుకున్నట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ లలో వచ్చే లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడట. మొత్తంగా ఇతని పారితోషికం రూ.20 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా. అంతకు మించినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని కూడా అనిల్ రావిపూడినే చేసినట్టు ఇన్సైడ్ సిర్కిల్స్ చెబుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు