Sarkaru Vaari Paata : వెనక్కి తగ్గిన మురారి సాంగ్..!

మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం తొలి రోజు మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయినా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా కలెక్షన్స్ ను రాబడుతుంది. విజయవంతంగా రెండు వారాలు పూర్తిచేసుకుని 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మూడో వీకెండ్ కు స్ట్రాంగ్ గా నిలబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అవకాశాలు కనిపించడం లేదు.అయితే ఈరోజు వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన ‘ఎఫ్3’ మూవీ విడుదల అయ్యింది.

ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ మూవీ పోటీని తట్టుకుని నిలబడడానికి ‘సర్కారు వారి పాట’ లో మురారి అనే పాటని జత చేయడానికి నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఈ పాటని చూడ్డానికి రిపీట్ ఆడియన్స్ వస్తారు అనేది వీరి నమ్మకం.

అయితే ఈరోజు ఆ పాటని జోడించలేదు. ‘ఎఫ్3’ వల్ల చాలా థియేటర్లలో నుండీ ‘సర్కారు వారి పాట’ ని తొలగించారు. రేపు మళ్ళీ ఆ సినిమాకి స్క్రీన్లు పెరుగుతాయి. దాంతో రేపటి నుండీ ‘సర్కారు వారి పాట’ లో మురారి సాంగ్ ను జత చేయబోతున్నట్లు వినికిడి.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 3 వ వారానికి ‘సర్కారు వారి పాట’ కి గాను 350 థియేటర్లను హోల్డ్ చేశారు నిర్మాతలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు