Ginna First Look : యాక్షన్ లోకి రావాలంటే ?

మంచు విష్ణు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అయితే, ఏదో చేశాడని కాదు. ఏది చేసినా, కామెడీ అవుతుందని ట్రోల్స్ రూపంలో కనిపిస్తాడు. మా అధ్యక్షుడుగా ఎన్నిక అయినా, మంచి విష్ణుపై ట్రోల్స్ మాత్రం తగ్గలేదు. నిజానికి మా అధ్యక్ష ఎన్నికల నుండే ఈ ట్రోల్స్ ఎక్కువయ్యాయని చెప్పొచ్చు.

కాగా, ఈ మంచు హీరో సినిమాలు చేసింది తక్కువే. అందులోనూ చెప్పుకోదగ్గ సినిమా ఒకటీ లేదు. అప్పుడెప్పుడో 2007 లో “ఢీ” అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. దీని తర్వాత అంతటి విజయం మంచు విష్ణుకు దక్కలేదు. ఇటీవల టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ తో “మోసగాళ్లు” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేశాడు. అది కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో “ఢీ” లాంటి హిట్ సినిమా చేయాలని విష్ణు బలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో వచ్చిందే “జిన్నా” సినిమా.

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సూర్య దర్శకత్వంలో వస్తుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ ను మంచు విష్ణు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కొత్తగా కనిపించాడు. అలాగే జిన్నా అని పిలుస్తేనే యాక్షన్ లోకి దిగుతాడు అన్నట్టు ఈ వీడియోలో చిత్ర బృందం చూపించింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు