FDFS: అనుదీప్ మార్క్

జాతి రత్నాలు సినిమాతో హిట్ కొట్టడమే కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అనుదీప్. జాతిరత్నాలు చిత్రం విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా అనుదీప్ ఇచ్చిన ఇంటర్వూస్, పాల్గొన్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో తనదైన శైలిలో హాస్యాన్ని పండించాడు. ప్రస్తుతం అనుదీప్ శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమాను చేస్తున్న విషయం విదితమే.

అనుదీప్ రీసెంట్ గా “ఫస్ట్ డే ఫస్ట్ షో” అనే కథను రాసారు అనుదీప్ రాసిన ఈ కథకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాషు నటించారు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎఫ్‌డిఎఫ్‌ఎస్ టీజర్‌ను ఆవిష్కరించి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా రిలీజైనప్పుడు జరిగిన యదార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలియజేసారు.

- Advertisement -

తమ అభిమాన నటుల సినిమాను FDFS చూడటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్స్ తీసుకోగల్గుతున్నాం కానీ ఒకప్పుడు స్టార్ హీరో సినిమాకి టికెట్ దక్కించుకోవడం పెద్ద విషయమే. ఈ విషయాలన్నీ FDFS టీజర్‌లో చూపించారు.ట్రైలర్ లో అనుదీప్ కెవి మార్క్ కనిపిస్తుంది. రాధన్ సంగీతం అందిస్తున్న FDFS చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు