వయసులో మన ప్రభాస్ కంటే పెద్దోడు విశాల్. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిజానికి విశాల్ ఎప్పుడో పెళ్లి చేసుకుంటాడు అని అంతా అనుకున్నారు. నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తో విశాల్ మధ్య లవ్ ట్రాక్ సాగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టిన వెంటనే వరలక్ష్మీని విశాల్ పెళ్లి చేసుకుంటాడు అని అంతా అనుకున్నారు. కానీ నడిగర్ సంఘం ఎన్నికల విషయంలో వీరి మధ్య భేదాాబిప్రాయాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీంతో ఈ జంట వీడిపోయిందని కోలీవుడ్ లో టాక్.
అయితే దీనిపై విశాల్ గానీ, వరలక్ష్మీ శరత్ కుమార్ గానీ స్పందిచలేదు.
దీని తర్వాత తెలుగమ్మాయి అనీషా రెడ్డి తో నిశ్చితార్దం చేసుకున్నాడు విశాల్. కోలీవుడ్ పెళ్ళిచూపులు సినిమాలో అనీషా నటించిన సంగతి తెలిసిందే. 2019 లో వీరి నిశ్చితార్థం అయ్యింది. కానీ అది పెళ్లిపీటలు వరకు వెళ్ళలేదు. కారణాలు ఏంటో తెలీదు.
అయితే విశాల్ మాత్రం ప్రేమ పెళ్లే చేసుకోవాలని భావిస్తున్నాడు. అంతేకాదు ఓ అమ్మాయి తో ప్రేమలో కూడా ఉన్నాడట. పెద్దలు కుదిర్చిన పెళ్లి అతనికి కలిసి రాదు అని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన విశాల్. ప్రస్తుతం తాను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను అని త్వరలోనే వివరాలను వెల్లడిస్తానని ప్రకటించాడు.
దీంతో విశాల్ ఎవరిని ప్రేమిస్తున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు కోలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.