Akhil : ఏజెంట్ తో వకీల్ సాబ్ ?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం సక్సెస్ తో అక్కినేని అఖిల్ మంచి ఊపులో ఉన్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడుఅఖిల్. కెరీర్ లోనే ఇది పెద్ద సినిమా. అలాగే పెద్ద బడ్జెట్ సినిమా కూడా. చిత్రీకరణ చాలా వరకు పూర్తయ్యింది. ఈ చిత్రం ఇలా ఫినిష్ అవుతుందో లేదో, తర్వాత సినిమాను పట్టాలెక్కించేలా అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే, అఖిల్ తన తర్వాత మూవీ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో చేయబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వకీల్ సాబ్ తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న వేణు శ్రీరామ్ , మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. వేణు పనితనానికి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా, మరో సినిమా చేయాబోతున్నట్టు కూడా వినిపించింది. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేకపోవడం అది సాధ్యం కాలేకపోయింది.
అల్లు అర్జున్ తో వేణు ఐకాన్ మూవీ చేయాల్సి ఉంది. కానీ అది ఎప్పటికి సెట్ అవుతుందో తెలీదు. రవితేజ తో కూడా సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ అది కూడా సెట్స్ పైకి రాలేకపోయింది. ఫైనల్ గా వేణు శ్రీ రామ్ కు అక్కినేని అఖిల్ దొరికాడు అన్న మాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు