Vikram: మహేష్ ఇంత లేటా ?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తన సినిమాలపై మాత్రమే కాదు తోటి స్టార్ హీరోల సినిమాల పై కూడా స్పందిస్తూ ఉంటాడు. మహేష్ లో మాత్రమే ఉన్న స్పెషాలిటీ అది. ఈ విషయాన్ని అటుంచితే ఇప్పటి వరకు మహేష్ ఫ్యామిలీ తో కలిసి హాలిడే ట్రిప్ లో ఉన్నాడు.ఇటలీ లో అతను రోడ్ల పై సంచరిస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో విక్రమ్ సినిమాని అతను మిస్ అయినట్టు తెలుస్తోంది.ఆలస్యం అయినా కూడా మహేష్ విక్రమ్ సినిమాని చూసి… వెంటనే తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

విక్రమ్ అనేది ఓ బ్లాక్ బస్టర్ సినిమా అని, ఇదొక కొత్త తరహా కల్ట్ క్లాసిక్ మూవీ అని, దర్శకుడు లోకేష్ టేకింగ్ కు ఎంత మెచ్చుకున్నా తక్కువే అని,అతన్ని కలిసి ప్రత్యేకంగా విక్రమ్ జర్నీ గురించి డిస్కస్ చేయాలని ఉందని, విజయ్ సేతుపతి.. ఫహాద్ ఫాజిల్ ల నటన అద్భుతం అని, అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పిన మహేష్, కమల్ హాసన్ గురించి ప్రస్తావిస్తూ… నేను మీకు పెద్ద అభిమానిని మీ నటన గురించి చెప్పడానికి నా అనుభవం ఎంత మాత్రం సరిపోదు అని, మీ ఫ్యాన్ గా మాత్రం విక్రమ్ అనేది నాకు గర్వపడే సినిమా అని మహేష్ ప్రశంసించాడు.ఇక విక్రమ్ కోసం పనిచేసిన టీమ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు