Samantha : కారణం నువ్వే

సమంత, నాగ చైతన్య 4 ఏళ్ళ పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ళ పాటు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారు. కానీ గతేడాది అక్టోబర్ 2 న వారు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ జంటను అభిమానించే వారు షాక్ కు గురయ్యారు.ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం పై చైతన్య, సమంత లను అడిగితే, మాకు సెపరేట్ గోల్స్ ఉన్నాయని, కలిసుండగా వాటిని నెరవేర్చుకోవడం కష్టం అవుతుందని, అందుకే ఎవరి దారి వారు చూసుకుని హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలిపారు. బంగార్రాజు ప్రమోషన్ల టైం లో కూడా చైతన్య ఇలాగే చెప్పుకొచ్చాడు.తర్వాత వీరిద్దరూ ఈ విషయం పై స్పందించింది లేదు.

తాజాగా కరణ్ జోహార్ షోలో సమంత పాల్గొంది. ఈ విషయం పై సమంత పరోక్షంగా కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత తాను సంతోషంగా ఉండలేకపోవడానికి కరణ్ కారణం అంటూ ఆమె తెలిపింది. పెళ్లి తర్వాత జీవితం బాగుంటుంది అంటూ నువ్వు ‘ కబీ కుషి కబీ కమ్ ‘ అనే సినిమాని తీశావ్. కానీ నిజజీవితంలో పెళ్లయ్యాక కే. జి.ఎఫ్ సినిమాలా ఉంది అంటూ సమంత కరణ్ తో చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చైతన్య, సమంత లు పెళ్లి అయ్యాక ఎక్కువ గొడవలు పడేవారు అని నెటిజన్లు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు