“మజిలీ” ఫేం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. వీడీ11 పేరుతో హిమలయాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. లవ్-రోమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఫేమస్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ పని చేస్తున్నారు.
తాజా గా ఈ మూవీ టీం బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేయడంతో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసింది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన బిగ్ కమిర్షియల్ హిట్ అందుకున్న ’’ఖుషి’’ మూవీ టైటిల్ నే ఈ మూవీకి ఎంచుకున్నారు.
ఆనందం, నవ్వు, ప్రేమ తో పాటు కుటుంబ బంధాల కలియికే ఈ ఖుషి అంటూ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. డిసెంబర్ 23న క్రిస్మస్, న్యూయర్ సందర్భంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
లవ్ అండ్ రోమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ, విజయ్-సమంత ఫస్ట్ లుక్స్ తో సూపర్ హైప్ క్రియేట్ అయింది. ఈ అంచనాలు ఇలాగే సాగితే.. విజయ్-సమంత భారీ హిట్ కొట్టడం ఖాయమే.