25 ఏళ్ళ Sunil : సినీ ప్రయాణం పై సునీల్ స్పందన..!

చిన్న చిన్న కేమియోలతో కెరీర్ ను మొదలుపెట్టిన సునీల్ ఆ తర్వాత కమెడియన్ గా మారి టాప్ పొజిషన్ కు వెళ్ళాడు. ఈయన దెబ్బకి అప్పటి టాప్ కమెడియన్స్ అందరూ సైడ్ కు వెళ్లిపోయారు. సునీల్ కాల్ షీట్లు దొరకనంత బిజీగా గడిపేవాడు. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా సరే అందులో సునీల్ కామెడీ ఉందా అని అంతా అడిగేవారు అంటే సునీల్ ఏ రేంజ్లో క్లిక్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ ‘సొంతం’ వంటి సినిమాలు సునీల్ ను టాప్ కమెడియన్ ను చేసాయి. అతనికి ఏర్పడ్డ క్రేజ్ కు హీరో అవకాశాలు కూడా వచ్చాయి. ‘అందాల రాముడు’ ‘మర్యాద రామన్న’ ‘పూల రంగడు’ ‘భీమవరం బుల్లోడు’ వంటి సినిమాలు హీరోగా సునీల్ కు మంచి హిట్లని అందించాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం మిగల్లేదు. ఇప్పుడు మళ్ళీ అతను కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు.

అయితే సునీల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సునీల్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయం పై స్పందించాడు. సునీల్ మాట్లాడుతూ.. “నా సినీ కెరీర్ చిత్ర విచిత్రంగా సాగుతుంది. ఫస్ట్ కమెడియన్ గా చేశాను. తర్వాత హీరోగా మారాను. నాలో వున్న హిడెన్ ట్యాలెంట్ డ్యాన్స్ ను చూపించే అవకాశం అలా దక్కింది. ఇంత లావు వున్న నేను సిక్స్ ప్యాక్ చేయగలిగాను.

- Advertisement -

తర్వాత విలన్ గా కూడా చేశాను తెలిసిందే. ‘పుష్ప’ మూవీలో నా వయసుకి మించిన పాత్ర చేశాను. నేను ఏది చేసినా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వారు నన్ను ఆదరించిన కారణంగానే నా ప్రయాణం ఇంత విలక్షణంగా సాగుతుంది అని నేను నమ్ముతాను. నన్ను 25ఏళ్ళుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు