Vijay Sethupathi: పవన్ కళ్యాణ్ పై విజయ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijay Sethupathi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఆంధ్రప్రదేశ్ యూత్ అందరిని ఆకర్షించాడు. పవన్ కళ్యాణ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషి సినిమా వరకు వరుస హిట్ సినిమాలును అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఖుషి సినిమా తర్వాత రిలీజ్ అయిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి అయితే వాటన్నిటికీ సమాధానంగా గబ్బర్ సింగ్ సినిమాతో మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.

Pawan Kalyan

లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే అయితే పార్టీని స్థాపించిన వెంటనే పోటీలోకి దిగకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. పవన్ సపోర్ట్ తో తెలుగుదేశం పార్టీ అప్పట్లో అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2019లో రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.రెండు చోట్ల కూడా ఓటమిని చవిచూశారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ పై చాలా ట్రోల్స్ మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడు కనీసం గెలవలేకపోయాడంటూ పర్సనల్ ఎటాక్ కూడా చాలా మంది చేశారు. అలానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా చాలామంది విమర్శలు చేస్తూ వచ్చారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసింది.ప్రస్తుతం దీనిపై విజయ్ సేతుపతి స్పందించారు. ఆయన గురించి ఎన్నో ట్రోల్స్ వచ్చాయి వాటన్నిటికీ నిలబడి ఆయన ఈరోజు సక్సెస్ ని చూశాడు. పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ హార్డ్ వర్క్ వీటన్నిటి పైన నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. వేరే వాళ్ళ కథల్లో ఆయన హీరో కాదు ఆయన జీవితంలో ఆయన హీరో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు విజయ్ సేతుపతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు