Pawan Kalyan: కొడుకు విషయంలో త్రివిక్రమ్ ను దూరం చేసుకోనున్నాడా..?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల మాటైనా వినడేమో కానీ త్రివిక్రమ్ చెబితే కచ్చితంగా వింటాడు అనే ఒక మాట ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా అటు సినిమాల విషయంలోనైనా ఇటు రాజకీయ రంగంలోనైనా సరే త్రివిక్రమ్ మాటను ఖచ్చితంగా వింటారు అని సమాచారం.. అంతేకాదు త్రివిక్రం వల్లే పవన్ కళ్యాణ్ కు దూరమయ్యాను అని బండ్ల గణేష్ పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు.. తాను దేవుడిగా భావించిన పవన్ కళ్యాణ్ ను తనకు దూరం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు.. అయితే ఇదిలా ఉండగా ఇంతటి మంచి అవినాభావ సంబంధం ఉన్న వీరిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కొడుకు విషయంలో త్రివిక్రమ్ ను దూరం పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే కొడుకును పాపులర్ చేస్తున్న పవన్..

అసలు విషయంలోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. తన తండ్రి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తిస్థాయిలో మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. తన తండ్రి అటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు నరేంద్ర మోడీలను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు.. తండ్రి వెంటే ఉంటూ దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు అకీరా నందన్.. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇండస్ట్రీలోకి అకీరా ఎప్పుడు వస్తాడు అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తూ ఉండగా.. ఈ విషయంపై రేణు దేశాయ్ అకీరాకు నటన అంటే ఇష్టం లేదని.. అతడు మ్యూజిక్, ఎడిటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడంటూ కామెంట్ చేసింది. అంతేకాదు అకీరా సినిమాలలో నటిస్తే చూడాలని ఉంది అని తాను కూడా కోరుకుంది.. ఇక తనకు ఇష్టం లేదని రేణు దేశాయ్ చెప్పడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

అకీరా కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న పవన్.

అయితే ఇప్పుడు కచ్చితంగా అకీరా నటన రంగంలోకి అడుగుపెడతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అతని హైట్ , లుక్స్ చూసి అందరూ ఫిదా అవ్వడమే కాదు సరైన సినిమాతో హీరోగా పరిచయమైతే చిన్న వయసులోనే స్టార్డంని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అంచనాలు రేకెత్తిస్తున్నారు . పవన్ కూడా అకీరా కోసం అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

రాజకీయాలలో కీలకం కానున్న పవన్..

మరోపక్క పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో కీలకంగా మారారు.. ఆయన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ పైన పెట్టాలని భావిస్తున్నారు.. అందుకే ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట.. మరొకవైపు పవన్ రాజకీయాలలో ఎంత బిజీగా మారినా ఆయన నుంచి సినిమాలు రాకపోతే మాత్రం అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలోనే ఆ లోటును భర్తీ చేయడానికి అకీరా ను హీరోగా పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారట.. అందుకే ఇప్పటి నుంచే తన వెంట తిప్పుతూ అభిమానుల దృష్టి తన కుమారుడు పై పడే విధంగా ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్..

త్రివిక్రమ్ ను కాదని పూరీ కి అకీరా బాధ్యతలు..

Pawan Kalyan: Is he going to distance Trivikram for his son?
Pawan Kalyan: Is he going to distance Trivikram for his son?

ఇదిలా ఉండగా అకీరా నందన్ హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే. ఆ బాధ్యత త్రివిక్రమ్ కి ఇస్తాడని అందరూ అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అనూహ్యంగా ఆ బాధ్యతను పూరీ జగన్నాథ్ కి అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే తాను హీరోగా నటించిన బద్రి సినిమాతోనే పూరీ దర్శకుడిగా పరిచయమయ్యారు.. పైగా ఈ సినిమాలో అకీరా తల్లి రేణూ దేశాయ్ కూడా నటించింది.. ఇలా తన తల్లిదండ్రులు నటించిన సినిమాతోనే డైరెక్టర్గా పరిచయమైన పూరీ తన మొదటి సినిమాకి డైరెక్టర్ అవడం అకీరాకి గొప్ప అనుభూతి అనే చెప్పాలి. అందుకే పూరీకి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొడుకు విషయంలో త్రివిక్రమ్ ని దూరం పెట్టినట్లే అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు