Vijay Sethupathi: 2019 లో ఉప్పెన చేశాను…2021 లో మన సినిమాకి హీరోయిన్ గా కృతి శెట్టి ను అడుగుదామా ? అని డైరెక్టర్ నన్ను అడిగారు.

Vijay Sethupathi: బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్స్ ను వసూలు చేసింది. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు దర్శకుడు బుచ్చిబాబు. సినిమా తర్వాత ఏకంగా రామ్ చరణ్ తో సినిమాను చేసి అవకాశాన్ని పొందుకున్నాడు. ఈ సినిమాతో వైష్ణవ తేజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు.

Uppena

ఇకపోతే కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతో హిట్ అందుకున్న తర్వాత వరుసగా అవకాశాలు కృతికి వచ్చాయి. అయితే ఉప్పెన సినిమా మినహాయిస్తే తర్వాత చేసిన సినిమాలేవి ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాలతో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ తరుణంలో తమిళ్లో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమైంది కృతి.

- Advertisement -

ఇకపోతే విజయ్ సేతుపతి నటిస్తున్న ఒక సినిమాకి హీరోయిన్ గా కృతి శెట్టి ని అడుగుదామని తన దర్శకుడు విజయ్ సేతుపతిని అడిగాడంట. దానికి విజయసేతుపతి బదులిస్తూ ఉప్పెన సినిమాను చేస్తున్నప్పుడు తనని నేను నన్ను తండ్రిగా ఫీల్ అవ్వమని చెప్పాను. తను కూడా అలానే ఫీల్ అయింది. అలా తమ సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి వేరే వాళ్ళు ఒప్పుకుంటారేమో కానీ నేను మాత్రం ఒప్పుకోను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో కృతి శెట్టి కూడా నో చెప్పింది అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు