Mahesh Babu: బావ కోసం మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకానున్న మహేష్ బాబు

Mahesh Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. వీళ్ళ సినిమా రిలీజ్ అయితే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. చాలామంది హీరోలు ఫంక్షన్స్ కి చీఫ్ గెస్ట్ గా వీళ్లను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు తెలుగు మాత్రమే పరిమితమైన వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను చేస్తున్నారు.

Mahesh Babu

ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. కానీ ఆ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా అవన్నీ అంతంత మాత్రమే ఆడాయి. ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమా మంచి డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబుకి మరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే సమ్మోహనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అలానే ఎస్ఎంఎస్ సినిమా కూడా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

- Advertisement -

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు చేస్తున్న సినిమా హరోం హర. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో సుబ్రమణ్యం అనే పాత్రలో కనిపిస్తున్నాడు సుదీర్ బాబు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుబ్రహ్మణ్యం కోసం రమణ గాడు అంటూ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు