HBD Balakrishna: ఇటు సినిమాలు అటు పాలిటిక్సే కాదు అందులోనూ తోపే..!

HBD Balakrishna.. నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ అటు సినిమాలలో వరుస సినిమాలు ప్రకటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు.. ఒక సినిమాలే కాదు ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఇదే హ్యాట్రిక్ నే ఆయన సొంతం చేసుకోవడం గమనార్హం. 2014 వరకు పరోక్షంగా టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చిన బాలకృష్ణ 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలోనే పోరాడుతున్నారు.. 2014 ఆంధ్రప్రదేశ్ హిందూపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన బాలయ్య అక్కడ గెలుపొంది.. శాసనసభ సభ్యుడుగా రికార్డు సృష్టించారు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.. మరొకసారి 2024 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో శాసనసభ సభ్యుడుగా ఎంపికై హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య

హ్యాట్రిక్ సినిమాలలోనే కాదు రాజకీయాల్లో కూడా..

HBD Balakrishna: It's not only movies and politics but also great in that..!
HBD Balakrishna: It’s not only movies and politics but also great in that..!

ఇకపోతే బాలయ్య సినిమాలు, రాజకీయాలలో హ్యాట్రిక్ కొట్టడం కాదు ఆస్తుల విషయంలో కూడా భారీగా కూడబెట్టినట్లు సమాచారం. మరి బాలయ్య ఆస్తుల విలువ ఎంత..? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి బాలయ్య ప్రాపర్టీ ఎంతో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

తండ్రి వారసత్వంగా రూ. వందల కోట్లు

బాలకృష్ణ ఆస్తులు సుమారుగా రూ.3000 కోట్లు ఉంటాయని సమాచారం. ఇందులో తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా ఎన్టీఆర్ థియేటర్లు, హోటల్స్ , స్టూడియోలు, ఇల్లు ఇలా ఎన్నో కొన్నారు.. వీటితో పాటు వందల ఎకరాల భూమి కూడా వీరి సొంతం. ఇక ఎన్టీఆర్ కి ఎనిమిది మంది కొడుకులు అయితే.. ఆయన ఆస్తులను కొడుకులకు సమానంగా పంచారు.. అయితే ఇప్పటికీ చెన్నైలో అప్పట్లో వీరు ఉన్న ఇల్లు ఉందట.. దాన్ని అమ్మకాన్ని కూడా పెట్టినట్లు సమాచారం. హైదరాబాదులో రామకృష్ణ స్టూడియో ఉంది.. ఇందులో అందరికీ వాటా ఉంది. నాచారం సమీపంలో కొన్ని ఎకరాలలో ఈ స్టూడియో ఉండడం గమనార్హం. ఇక దీని విలువ రూ.వేలకోట్లు ఉంటుందని తెలుస్తోంది.. నిజానికి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాచారం సమీపంలో కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేశారని.. అప్పట్లో చాలా వరకు కొన్ని కారణాలవల్ల అమ్మేశారని.. అంతేకాదు కొన్ని ఇల్లు కూడా నిర్మించారని సమాచారం. ఇక అలా తండ్రి నుంచి బాలయ్యకి వారసత్వంగానే రూ.వందల కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

బాలయ్య సంపాదించిన ఆస్తులు..

హైదరాబాదులో రూ .2లక్షల విలువ చేసే ఇల్లు కూడా కొనుగోలు చేశారు. అంతేకాదు జూబ్లీహిల్స్ లో చంద్రబాబునాయుడు ఇంటికి సమీపంలో ఒక లగ్జరీ హౌస్ ఉంది.. దీంతో పాటు ఇటీవల రూ.35 కోట్లు పెట్టి మరో కొత్త ఇల్లును కొనుగోలు చేశారు ..దీనిని కొనడానికి రూ.15 కోట్లు ఖర్చు అయితే రిజిస్ట్రేషన్ కోసం రూ .1కోటి , ఇంటిని మాడిఫికేషన్ చేయడానికి రూ .16 కోట్లు ఖర్చు చేశారట.. ప్రస్తుతం దీని విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.. అంతేకాదు ఈ రెండు ఇళ్ళ ను కలుపుకుంటే.. సుమారుగా రూ .110 కోట్ల విలువ చేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి..

బాలయ్య లగ్జరీ కార్లు..

బాలయ్య దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.. బెంట్లే, బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడి వంటి కార్లు బాలయ్య దగ్గర ఉన్నాయి వీటిలో సుమారుగా రూ.25 కోట్ల. ఇకపోతే ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద రూ.81,63,00,000 కోట్ల ఆస్తి ఉన్నట్లు భార్య వసుంధర పేరు మీద రూ.140,38,00,000 లక్షల ఆస్తి ఉన్నట్లు, కుమారుడు మోక్షజ్ఞ ఆస్థి విలువ రూ.58,63,66,000గా చూపించారు బాలయ్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు