Vijay: హైదరాబాద్ లో సెలబ్రేషన్స్

ఇలయథలపతి విజయ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఒకప్పుడు రజినీకాంత్ , కమల్ హాసన్ , సూర్య , కార్తీ , విశాల్ ,శింబు సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో అది కొంత మారింది వాళ్ళ సినిమాలు కంటే మన సినిమాలు మెరుగ్గా ఉండటం, ఎక్కువశాతం వాళ్ళు ఇక్కడ ద్రుష్టి పెట్టకపోవడం, డబ్బింగ్ విషయంలో , టైటిల్స్ విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం ఇందుకు కారణాలు కావొచ్చు. ఇప్పుడిప్పుడే ఇలయథలపతి విజయ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ పెరుగుతుంది.

ఆ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగింది అంటే ఒక పరభాషా నటుడు పుట్టినరోజు సంధర్బంగా హైదరాబాద్ లోని సంధ్య 35MM థియేటర్ లో పదేళ్ల కింద వచ్చిన “తుపాకీ” సినిమాను వేస్తున్నారు. మామూలుగా మ‌న టాప్ స్టార్ హీరోల బ‌ర్త్ డేల టైంలో స్పెష‌ల్ షోలు వేస్తుంటారు. కానీ తమిళ్ హీరో సినిమాని ఇలా ప్రదర్శించడం మొదటిసారి.

విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడైన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “వారసుడు” అనే ద్విభాషా ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తమిళ్ లో “వరిసు” అనే టైటిల్‌ను ఖరారు చేసారు. నిన్న అనగా (జూన్ 21) ఫస్ట్ లుక్ విడుదలచేసిన ఈ చిత్ర బృందం, నేడు జూన్ 22న థళపతి పుట్టినరోజు సంధర్బంగా “వారసుడు” సెకండ్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా ప్రముఖ నటి రష్మిక మందన్న నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న “వారసుడు” చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు