Prabhas : తెలుగు మార్కెట్ పై శ్రద్ధ పెట్టాల్సాందే ?

‘బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క సినిమాతో డార్లింగ్ మార్కెట్ దాదాపు 10 రెట్లు పెరిగింది. ఐదేళ్ల కష్టానికి దక్కిన గుర్తింపు, గౌరవం అని చెప్పొచ్చు. అయితే ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టు కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు అనే భావన అందరిలోనూ కలుగుతుంది. ఎందుకంటే ప్రభాస్ నుండి ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాలు ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘రాధే శ్యామ్’ అయితే ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ‘ఆదిపురుష్’ కు ఆశించిన స్థాయిలో బిజినెస్ అవ్వడం లేదట. దర్శకుడు ఓం రౌత్ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి. ఎంత రామాయణం బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా అయినా, ఇప్పుడున్న పరిస్థితులకు రిపీట్ ఆడియన్స్ చూడటం కష్టమే, అనే భావన తెలుగు డిస్ట్రిబ్యూటర్లలో కలిగింది. ఒక్క కన్నడలో మినహా, ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో బిజినెస్ అవ్వడం లేదని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆదిపురుష్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని, వారు ‘సలార్’ కోసమే ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

‘కె.జి.ఎఫ్ 2’కు నైజాం లో లాభాలు బాగానే వచ్చినా, ఆంధ్రాలో రూ.8 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలను ‘సలార్’ తో తీరుస్తాము అని నిర్మాతలు హామీ ఇచ్చారు. కానీ, ప్రభాస్ గత సినిమాల రిజల్ట్ లను చూసిన తర్వాత, ఈ సినిమాకు మరింత ఎక్కువ రేటు పెట్టలేము అని చెప్పేస్తున్నారట తెలుగు బయ్యర్స్. కాబట్టి, ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లో తన మార్కెట్ ను కాపాడుకునేలా సినిమాలు చేయడం బెటర్ అనేది కొందరి అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు