HIT : నాని “హిట్” కొడతాడా ?

నేచురల్ స్టార్ నాని టైం ఈ మధ్య కాలంలో బాగా లేదనిపిస్తుంది. గత ఏడాది రెండు వివాదాల్లో చిక్కుకున్నాడు నాని. ఒకటి ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో, కాగా ఇంకోటి ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా రిలీజ్ టైంలో టికెట్ రేట్ల విషయంలో అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఏదో ఒక రకంగా గట్టెక్కాయి. నిర్మాతలు హ్యాపీ. అయితే, ఇటీవల నాని నుండి వచ్చిన ‘అంటే సుందరానికీ’ చిత్రం పాజిటివ్ టాక్ ను రాబట్టినా, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.10 కోట్ల వరకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని ట్రేడ్ సిర్కిల్స్ చెబుతున్నాయి.

ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు టైం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో నాని నుండి రాబోతున్న చిత్రం ‘హిట్ ది సెకండ్ కేస్’. అయితే, ఈ సినిమాకు నాని హీరో కాదండి. నిర్మాత మాత్రమే. కరోనా లాక్ డౌన్ కు ముందు విడుదలైన ‘హిట్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాని ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఇప్పటికే మేజర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్న అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్యనే రషెస్ చూసిన నాని, ఈ చిత్రం మంచి విజయం సాధించడం ఖాయమని నాని నమ్ముతున్నాడట. అడివి శేష్ కూడా ఈ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు బాగా కుదిరినట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు