బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 భారత చిత్ర సీమనే తమ అధీనంలోకి తెచ్చుకున్న సినిమాలు. సౌత్ సత్తా అంటే ఏంటో బాలీవుడ్ కు పరిచయం చేశాయి. వీటిని చూసే టాలీవుడ్ లో చిన్న హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. డైరెక్టర్లు కూడా ఆ రేంజ్ స్టోరీ లను రెడీ చేస్తున్నారు. అది హిట్ అవుతుందా..? లేదా ఫట్ అవుతుందా..? అని ఆలోచించకుండా, తెలుగు పరిశ్రమను దేశంలో అగ్ర భాగంలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
“పెళ్లి చూపులు” సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ, కొద్ది రోజుల్లోనే రౌడీ హీరోగా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్”, “జనగణమన” చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న “లైగర్” మూవీ ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కాగా, “జనగణమన” షూటింగ్ జరుపుకుంటుంది.
ఇదిలా ఉండగా, ఈ రౌడీ హీరో మరో మూవీకి సైన్ చేసిన విషయం తెలిసిందే. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు “ఖుషి” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ, తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషాల్లో రిలీజ్ చేయనున్నారు.
రౌడీ హీరోకు లైగర్, జనగణమన సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ భారీగానే పెరిగే అవకాశం ఉంది. సమంతకు మోస్తారు మార్కెట్ ఉంది. ఫస్ట్ లుక్ తో.. ఈ మూవీ పాన్ ఇండియా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా, స్టోరీ మొత్తం కశ్మీర్ లోనే ఉంటుందని తెలుస్తుంది.
ఈ తరుణంలో ఖుషి మూవీని హిందీలో రిలీజ్ చేయలేకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మూవీని హిందీ రిలీజ్ చేయకపోవడానికి ఖుషి టీం కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే, మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.