మహేష్ బాబు నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. తొలిరోజు మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నా.. వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.87 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కలుపుకుని ఓవర్సీస్లో $2 మిలియన్ మార్క్ ను అందుకుంది ఈ మూవీ.
మహేష్ బాబు కెరీర్లో 2 మిలియన్ అందుకున్న ఇది 4 వ మూవీ కావడం విశేషం. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలు $2 మిలియన్ డాలర్లని వసూల్ చేశాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’ కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అయ్యింది.
నిజానికి మొదటి రోజు నమోదైన టాక్, రివ్యూ ను బట్టి చూస్తే.. $2 మిలియన్ కొట్టే అవకాశమే లేదు. పైగా ఓవర్సీస్ జనాలు రివ్యూలు చదివి.. మంచి రేటింగ్ ఉంది అనుకుంటే థియేటర్లకు వెళ్లి చూస్తారు. ఆ రకంగా అయితే మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలకి జనాలు థియేటర్లకి వెళ్ళకూడదు. కానీ ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకి మంచి క్రేజ్ ఉంది.
అతని సినిమాలు $1 మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేస్తూ ఉంటాయి. అయితే 2 మిలియన్ కొట్టాలి అంటే మిగిలిన హీరోలకి మంచి రివ్యూలు, రేటింగ్ లు కావాలి. లేదా అవి పాన్ ఇండియా సినిమాలు అయ్యి ఉండాలి. మహేష్ కు మాత్రమే అక్కడ ఆల్ టైం రికార్డులు సాధ్యపడతాయి.