Varun Tej-Lavanya: వరుణ్ తేజ్ – లావణ్యల హనీమూన్ స్పాట్ ఫిక్స్..!

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తమ ప్రేమను పండించుకుని.. ఇటీవల పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం టస్కానిలో విరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వీళ్ళ హనీమూన్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరి హనీమూన్ స్పాట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ – లావణ్య తమ హనీమూన్ కోసం ఓ స్పెషల్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారట. అదెక్కడో కాదు.. ఇండోనేషియాలోని బాలి నగరం. ఈ మధ్యకాలంలో జంటలందరూ మాల్దీవ్స్ కి హనీమూన్ కోసం వెళుతుంటే వరుణ్ – లావణ్య మాత్రం డిఫరెంట్ గా ఆలోచించి బాలి ప్లేస్ ని ఎంచుకున్నారట. బాలి ప్లేస్ అందమైన ప్రదేశం. ఈ వెదర్ కి బాలి అయితేనే పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ అంటూ ఫిక్స్ అయ్యారట ఈ కొత్తజంట.

అందుకే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారట. అలా వీరు బాలి దేశానికి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు అక్కడే ఉండి ఎంజాయ్ చేసి వస్తారని తెలుస్తోంది. అయితే కొందరు ఆకతాయిలు వీళ్ళ హనీమూన్ కి సంబంధించిన వార్తలపై పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఆకతాయిల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు చేస్తున్నాడు. ఇవి త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు