Varun Tej : రానాను వరుణ్ ఏడిపిస్తాడట..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ కూడా చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వరుణ్ నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపిస్తాడు. ఇతనికి జోడీగా మెహ్రీన్ మరోసారి నటిస్తుంది. ‘ఎఫ్2’ కంటే కూడా ‘ఎఫ్3’ మూవీలో వరుణ్ సన్నగా కనిపిస్తున్నాడు. ఇతని లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. ‘ఎఫ్3’ ప్రమోషన్లలో భాగంగా వరుణ్.. వెంకటేష్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

వరుణ్ మాట్లాడుతూ.. “వెంకటేష్ గారితో నాకంటే ముందే కళ్యాణ్ బాబాయ్ వర్క్ చేశారు. అయితే నాకు ఆయనతో రెండో సారి కలసి వర్క్ చేసే ఛాన్స్ రావడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్శనల్ గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్ లా అనిపిస్తారు. చిరంజీవి గారితో ఆయనకి ఉండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు.

అప్పుడప్పుడు నేను రానాకి ఫోన్ చేసి.. ‘మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు కూడా నాకు చెప్తుంటారు అంటూ ఏడిపిస్తుంటాను. వెంకటేష్ గారు చాలా లైట్ హార్టడ్. చాలా కూల్ గా ఉంటారు. చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్ కి రెండు నిమిషాల ముందే వెళ్ళడం నేర్చుకున్నాను. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్వాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్ గా ఉంటారు” అంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు