Salaar : సలార్ మళ్లీ పెంచేశారు..

సౌత్ సినిమా.. కొద్ది రోజుల ముందు ప్రపంచంలో ఓ చిన్న వ్యవస్థ. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రపంచంలో చాలా మందికి తెలియని స్థితిలో ఉండేది. కానీ, టాలీవుడ్ నుండి “బాహుబలి” “పుష్ప” “ఆర్ఆర్ఆర్”, శాండిల్ వుడ్ నుండి “కేజీఎఫ్-2” వచ్చిన తర్వాత, యావత్ ప్రపంచమే సౌత్ సినిమా వైపు చూసింది. ఇక్కడ కూడా టాలెంటెడ్ డైరెక్టర్లు, హీరోలున్నారని సినీ ప్రపంచం గుర్తించింది.

ఈ సినిమాలు సౌత్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీలకు ఓ ఆశ దీపంలా కనిపించాయి. అలాంటి సినిమాలు చేయాలని దర్శకులు, నిర్మాతలు రెడీ అయిపోయారు. బాలీవుడ్ కూడా సౌత్ తరహాలో సినిమాలు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం వచ్చే సినిమాల్లో చాలా వరకు పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా, వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న “సలార్” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోవడానికి ప్రశాంత్ నీల్, ప్రభాస్ కు తగ్గట్టుగా హై ఒల్టేజ్ యాక్షన్, మాస్ సీన్స్ భారీగా ఉండేలా స్క్రీప్ట్ రీ డిజైన్ చేశాడు.

- Advertisement -

సలార్ ను నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధమే అంటుంది. ఇప్పటికే 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి మరింత బడ్జెట్ ను కేటాయించారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ లో అదనంగా 40 కోట్లు చేర్చుతున్నట్టు హోంబలే అధినేత విజయ్ తెలిపారు. భవిష్యత్తులో మరింత పెంచాల్సి వస్తే, తాము తగ్గేదేలే అని అంటున్నారు.

ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్, ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు